కరెంట్‌ అఫైర్స్‌

పార్లమెంటరీ స్థాయీ సంఘాల కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని ‘వ్యవస్థ మెరుగుదల (సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌) కమిటీ’ నివేదిక సిఫార్సు చేసింది. రాజ్యసభ సచివాలయం పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి పని తీరు మెరుగుకు

Published : 07 Jul 2022 00:10 IST

సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కమిటీ నివేదిక

పార్లమెంటరీ స్థాయీ సంఘాల కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని ‘వ్యవస్థ మెరుగుదల (సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌) కమిటీ’ నివేదిక సిఫార్సు చేసింది. రాజ్యసభ సచివాలయం పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి పని తీరు మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ ఏడాది జనవరిలో ‘‘సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌’’ పేరిట ఓ కమిటీని వేశారు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌ పి.పి.కె.రామాచార్యుల ఆధ్వర్యంలోని ఈ కమిటీ 2022 జులై 5న తమ నివేదికను ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి అందజేసింది.


ప్రపంచమంతటా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతున్నా వర్థమాన దేశాల్లో మూడో వంతు మహిళలు 19 ఏళ్లు, అంతకు తక్కువ వయసులోనే గర్భం ధరిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనాభా సంస్థ (యూఎన్‌ఎఫ్‌పీఏ) వెల్లడించింది. ఇలా కౌమారప్రాయంలో పిల్లలను కనే మహిళలు 40 ఏళ్లు నిండేసరికి సగటున అయిదుగురు పిల్లలకు జన్మనిస్తారని వివరించింది. భారత్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, ఇండోనేసియా, మాల్దీవులలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని తెలిపింది. భారత్‌లో స్థూల గర్భధారణ రేటుతో పాటు కౌమారప్రాయంలో గర్భధారణ రేటూ తగ్గిపోతోందని యూఎన్‌ఎఫ్‌పీఏ వెల్లడించింది.


క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్‌ అనే పదార్థాన్ని సులువుగా రూపొందించే ప్రక్రియను దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. క్వినోన్‌లకు ఫల్వీన్‌ను జోడించడం ద్వారా పాలీఆరిల్‌క్వినోన్‌ను సులువుగా తయారుచేయవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ చర్యలో పలాడియం లోహాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించారు. ఈ పరిశోధన బృందానికి రవి పి సింగ్‌ నాయకత్వం వహించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని