కరెంట్‌ అఫైర్స్‌

డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్‌ లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు(2022)కు ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్‌ స్మారక ట్రస్టు ఏటా ఈ అవార్డు అందిస్తోంది.

Published : 31 Jul 2022 01:18 IST

టెస్సీ థామస్‌కు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు

డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్‌ లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు(2022)కు ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్‌ స్మారక ట్రస్టు ఏటా ఈ అవార్డు అందిస్తోంది. స్వదేశీ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకుగాను టెస్సీ థామస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ట్రస్టు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దీపక్‌ తిలక్‌, రోహిత్‌ తిలక్‌ తెలిపారు.

కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) జులై 29న విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022-23 మొదటి త్రైమాసికం చివరినాటికి ద్రవ్యలోటు విలువపరంగా   రూ.3.51 లక్షల కోట్లుగా నమోదైంది. ఏప్రిల్‌-జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 2022-23 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంలో 21.2 శాతానికి చేరింది. 2021-22 ఇదే కాలంలో ద్రవ్యలోటు అప్పటి (2021-22) బడ్జెట్‌ లక్ష్యంలో 18.2 శాతంగా ఉంది. ప్రభుత్వం మొత్తం ఆదాయాలు, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని ఆతిథ్య ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. పురుషుల ట్రయథ్లాన్‌లో ఆ దేశ అథ్లెట్‌ అలెక్స్‌ యీ విజేతగా నిలిచాడు. హేడెన్‌ (న్యూజిలాండ్‌) రజతం, మాథ్యూ హసెర్‌ (న్యూజిలాండ్‌) కాంస్యం దక్కించుకున్నారు.

జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) సంచాలకులు డాక్టర్‌ వి.ఎం.తివారీకి ప్రతిష్ఠాత్మక జియో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జాతీయ అవార్డు లభించింది. దిల్లీలో జులై 27న జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

జీవశాస్త్రం అధ్యయనంలో బయో ఇంధనాలు,కొత్త వంగడాలు, వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు, ప్రక్రియలు, విధానాల ప్రాథమిక వివరాలపై దృష్టిపెట్టడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని