కరెంట్‌ అఫైర్స్‌

సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరు?

Published : 06 Aug 2022 05:34 IST

సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరు?

జ: సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు 

తెలంగాణ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

జ: మెట్టు శ్రీనివాస్‌

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) దక్షిణ భారత ప్రాంతీయ  ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

జ: హైదరాబాద్‌

డ్యామ్‌ సేఫ్టీ బిల్‌ దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 2022, జూన్‌ 30

ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ నివేదికగా పేర్కొనే జీఎస్‌ఈఆర్‌ (గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌)-2022లో తెలంగాణ టాప్‌-10 లో చోటు దక్కించుకుంది. ఈ నివేదికను ఏ నగరంలో విడుదల చేశారు?

జ: లండన్‌

నీతి ఆయోగ్‌ తాజా నివేదిక ప్రకారం పట్టణీకరణ వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో ఎన్నో  స్థానంలో నిలిచింది?

జ: 3వ స్థానం

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం మొదటి బహుమతి కింద ఎంత నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించింది? 

జ: రూ.కోటి

మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు, కీటకాల నుంచి ప్రమాదం ఉందని గ్రహించినప్పుడు స్వీయ రక్షణలో భాగంగా  సాలిసిలిక్‌ ఆమ్లాన్ని విడుదల చేస్తున్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది?

జ: అమెరికా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని