కరెంట్‌ అఫైర్స్‌

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తమిళ చిత్రం సూరారైపోట్రు ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీన్ని కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఆయన ఏ విమానయాన సంస్థ వ్యవస్థాపకుడు?

Published : 14 Aug 2022 02:29 IST

మాదిరి ప్రశ్నలు

* 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తమిళ చిత్రం సూరారైపోట్రు ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీన్ని కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఆయన ఏ విమానయాన సంస్థ వ్యవస్థాపకుడు?

జ: ఎయిర్‌ డెక్కన్‌
* రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఇతర పోలీసు విభాగాల్లో ఫంక్షనల్‌ వర్టికల్స్‌ను (పని విభజన అంశాలు) అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ఇలా పోలీసు విధులను విభజించారు. అందులో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి?         

     జ: 17
* దేశంలో పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలపాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు?
      జ: జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌
* ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ రేసులో స్వర్ణ పతకాన్ని నెగ్గిన అమెరికా స్ప్రింటర్‌ ఎవరు? 

  జ: సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌
* పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య ఎంతకు చేరింది? 

  జ: 607


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని