అవరోధాలా? అవకాశాలవి!

సమస్యలూ, అవరోధాలూ ఎదురైనప్పుడు చాలామంది వాటి నుంచి దూరంగా పారిపోవాలని ఆలోచిస్తుంటారు. అయితే ప్రతి అడ్డంకిలోనూ అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే అంతా సానుకూలమే!  

Updated : 18 Aug 2022 05:29 IST

ప్రేరణ

సమస్యలూ, అవరోధాలూ ఎదురైనప్పుడు చాలామంది వాటి నుంచి దూరంగా పారిపోవాలని ఆలోచిస్తుంటారు. అయితే ప్రతి అడ్డంకిలోనూ అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే అంతా సానుకూలమే!  

జీవితంలోని వివిధ దశల్లో అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. పరీక్షలో ఫెయిల్‌ కావడం అనేది విద్యార్థికీ.. ఇంటర్వ్యూలో ఎంపిక కాలేకపోవడం ఉద్యోగార్థికీ.. ఆశించిన పదోన్నతి పొందలేకపోవడం ఉద్యోగికీ ఎదురయ్యే సమస్యలు. వీటన్నింటినీ అడ్డంకులుగానే భావించి నిరాశపడితే మన ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది. కానీ వాటినో అవకాశంగా తీసుకుంటే మరింత కష్టపడి పనిచేసి చక్కని ఫలితాలను సాధించవచ్చు.

ఒకసారి ఓ రాజుగారు పెద్ద బండరాయిని తెప్పించి దారిలో అడ్డంగా వేయించి.. ప్రజల స్పందనను రహస్యంగా గమనించసాగారు. సంపన్నులైన కొందరు వ్యాపారులు ఆ దారి నుంచి వెళ్లారుగానీ ఒక్కరు కూడా రాయిని తొలగించే ప్రయత్నం చేయలేదు. మరికొందరైతే రాజుగారి పాలనలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు కూడా. ఈలోగా కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. అడ్డుగా ఉన్న రాయి వల్ల బాటసారులు ఇబ్బందిపడటాన్ని గమనించాడు. నెత్తి మీద ఉన్న గంపను కింద పెట్టి రాయిని కదిలించడానికి ప్రయత్నించాడు. రెండుమూడుసార్లు గట్టిగా ప్రయత్నిస్తేగానీ బండరాయి పక్కకు కదలలేదు. ఇదంతా రహస్యంగా గమనించిన రాజుగారు ఇతరుల ఇబ్బందిని తొలగించడానికి శాయశక్తులా ప్రయత్నించిన ఆ వ్యక్తిని ప్రశంసించి.. బంగారు నాణేలను బహూకరించారు. అవరోధాన్ని గమనించి నిష్ర్కియగా ఉండకుండా చేతనైనంతలో తొలగించే ప్రయత్నం చేస్తే సత్ఫలితమే అందుతుంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని