కరెంట్‌ అఫైర్స్‌

దిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలోని గ్రానైట్‌ రాయి (ఏకశిల)తో రూపొందించారు?

Published : 27 Oct 2022 04:46 IST

మాదిరి ప్రశ్నలు

* దిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలోని గ్రానైట్‌ రాయి (ఏకశిల)తో రూపొందించారు?

జ: తెలంగాణ (ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో ఉన్న క్వారీలోని 280 మెట్రిక్‌ టన్నుల బరువున్న 100 అడుగుల గ్రానైట్‌ రాయిని ఉపయోగించి నేతాజీ విగ్రహాన్ని రూపొందించారు.)

* బాస్మతీయేతర బియ్యంపై కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ 2022 సెప్టెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది?

జ: 20 శాతం

* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌లో ఏ నగరానికి చెందిన విద్యార్థులు ముందంజలో ఉన్నారు?

జ: హైదరాబాద్‌

* ఏ దేశం 2022 సెప్టెంబరులో తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒక ఒప్పందం చేసుకుంది? (ఒక దేశ వాణిజ్య శాఖ భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి)

జ: థాయ్‌లాండ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని