కరెంట్‌ అఫైర్స్‌

2022, సెప్టెంబరు 30న త్రివిధ దళాల నూతన అధిపతిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?  

Updated : 30 Nov 2022 04:10 IST

మాదిరి ప్రశ్నలు

* 2022, సెప్టెంబరు 30న త్రివిధ దళాల నూతన అధిపతిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?  

జ: లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

* 21వ శతాబ్దం కోసం తయారు చేసిన ‘చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో యునెస్కో విడుదల చేసిన భారత 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాల జాబితాలో చోటు పొందిన తెలంగాణ చేనేత వస్త్రాలు ఏవి?

జ: హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, నల్లగొర్రెల గొంగడి

* జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ జీఓను జారీ చేసింది? (2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం సుమారు 3.5 కోట్లు. వీరిలో ఎస్టీలు 31.78 లక్షలు (9.08 శాతం). మొత్తం గిరిజన తెగలు 32 (నాలుగు పీవీటీజీలు సహా).

జ: జీఓ నంబరు 33

* ఆహార కల్తీపై ఫిర్యాదులకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబరు ఏది? (×జీతినీదిబిబీలీది× హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది)  

జ: 040 - 21 11 11 11


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని