కరెంట్‌ అఫైర్స్‌

2023, జనవరి 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)  సదస్సులో భారత్‌ నుంచి పాల్గొన్న ఇద్దరు యువ పర్యావరణవేత్తలు ఎవరు?...

Published : 03 Feb 2023 00:42 IST

మాదిరి ప్రశ్నలు

2023, జనవరి 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)  సదస్సులో భారత్‌ నుంచి పాల్గొన్న ఇద్దరు యువ పర్యావరణవేత్తలు ఎవరు?

జ: కరణ్‌కుమార్‌, కె.గాయత్రి రెడ్డి


ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్‌ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? (ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్‌లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్‌ సంచులను మాత్రమే వినియోగించాలి. ఇప్పటి వరకు 75 మైక్రాన్‌ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది)  

జ: 2022, డిసెంబరు 31


అంతరిక్షంలో షూటింగ్‌ జరిపిన తొలి చిత్రంగా ఏ దేశానికి చెందిన ‘ది ఛాలెంజ్‌’ సినిమా రికార్డు సృష్టించింది? (ఈ చిత్ర దర్శకుడు క్లిమ్‌ షెపెంకో)

జ: రష్యా


రాబోయే మూడేళ్లలో భారత్‌ సోర్జ్‌ కంపెనీ నుంచి 155 ఎంఎం హోవిట్జర్‌ శతఘ్నులను కొనుగోలు చేయడానికి ఏ దేశం రూ.1200 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది? (2020లో అజర్‌బైజాన్‌కు, ఈ దేశానికి మధ్య పోరాటం సాగుతున్నప్పుడు భారత్‌ స్వాతి రాడార్‌లను ఈ దేశానికి విక్రయించింది. శత్రు దేశ ఫిరంగులు, ఇతర ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో స్వాతి రాడార్‌లు కనిపెట్టగలవు)

జ: ఆర్మేనియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని