కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022, డిసెంబరులో దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ‘దిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌’ను ఏ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించింది.

Published : 09 Mar 2023 02:17 IST

మాదిరి ప్రశ్నలు

* కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022, డిసెంబరులో దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ‘దిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌’ను ఏ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించింది?

జ: వేర్‌ భారత్‌ మీట్స్‌ ఇండియా

* ఏ నగరంలో ఏర్పాటుచేసిన ‘డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌’ ్బళీశిలీ  విఖిజూతిళ్శీ ను 2023, జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు? (రూ.100 కోట్ల వ్యయంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు)

జ:  కోల్‌కతా

* సెంట్రల్‌ డిటెక్టివ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు (సీడీటీఐ) 2023, జనవరిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఏ నగరంలో శంకుస్థాపన చేశారు?

జ: దేవనహళ్లి, కర్ణాటక

* రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా     గవర్నర్‌ను తొలగిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించింది?

జ: కేరళ

* భారతీయ రైల్వే దేశంలోని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం ఏ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది?

జ: అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌

* ఈజిప్ట్‌లోని షర్మ్‌ అల్‌ షేక్‌లో నిర్వహించిన కాప్‌ - 27 సదస్సులో ఏర్పాటు చేసిన ‘మాంగ్రూవ్‌ అలయన్స్‌ ఫర్‌ క్లైమేట్‌’లో (ఎంఏసీ) చేరిన తొలి అయిదు సభ్య దేశాలు ఏవి?

జ: భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, స్పెయిన్‌, శ్రీలంక

* ఇండియన్‌ బయోలాజికల్‌ డేటా సెంటర్‌ను (ఐబీడీసీ) ఏ నగరంలో ఏర్పాటు చేశారు?

జ: ఫరీదాబాద్‌, హరియాణా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని