పొటాటో.. ప్రొటాటోగా మారితే!
ఒక జీవిలోని జన్యువులను వేరు చేసి మరో జీవిలో ప్రవేశపెట్టడాన్ని జన్యుమార్పిడి అంటారు. దీని ఫలితంగా జన్యు పరివర్తన జరిగి జీవిలో కావాలనుకున్న కొత్త లక్షణాలు వస్తాయి, లేదా ఉన్నవాటిలో వద్దనుకున్న లక్షణాలు పోతాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఒక జీవిలోని జన్యువులను వేరు చేసి మరో జీవిలో ప్రవేశపెట్టడాన్ని జన్యుమార్పిడి అంటారు. దీని ఫలితంగా జన్యు పరివర్తన జరిగి జీవిలో కావాలనుకున్న కొత్త లక్షణాలు వస్తాయి, లేదా ఉన్నవాటిలో వద్దనుకున్న లక్షణాలు పోతాయి. ప్రకృతి సహజంగా కలవలేని ప్రాణుల మధ్య లక్షణాల మార్పిడికి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రధానంగా తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే వాణిజ్య, ఆహార పంటల అభివృద్ధి కోసం ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. జీవశాస్త్రంలో సంచలనాలకు, వివాదాలకు కేంద్రమైన ఈ అంశంపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. మన దేశంలో జరిగిన, జరుగుతున్న జన్యు మార్పిడి ప్రయోగాలు, వాటి ప్రభావాల గురించి తెలుసుకోవాలి.
జన్యు పరివర్తన జీవులు
1. జన్యు పరివర్తన జీవులను సృష్టించడానికి ఏ సాంకేతికత ఉపయోగపడుతుంది?
1) జన్యు ఇంజినీరింగ్
2) హైబ్రిడోమా టెక్నాలజీ
3) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
4) జీన్ టెక్నాలజీ
2. జన్యుపరివర్తన ఈ-కొలై అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఏ మానవ హర్మోన్‌ను ఉత్పత్తి చేశారు?
1) పెరుగుదల హార్మోన్ 2) ఇన్సులిన్
3) గ్లూకగాన్ 4) అడ్రినలిన్
3. జన్యుపరివర్తన ఈస్ట్‌ను ఉపయోగించి ఏ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు?
1) ఎయిడ్స్ 2) డెంగీ
3) హెపటైటిస్ - తీ 4) పోలియో
4. బ్యాక్టీరియాలోకి జన్యువులను ప్రవేశపెట్టి దాన్ని పరివర్తనం చెందించి ఏ రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నారు?
1) పెరుగుదల హర్మోన్ 2) ఇంటర్‌ఫెరాన్‌లు
3) రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు 4) పైవన్నీ
5. బీటీ పత్తి వేటికి నిరోధకత చూపడం వల్ల దిగుబడి పెరుగుతుంది?
1) బ్యాక్టీరియా 2) కీటకాలు 3) వైరస్ 4) శిలీంధ్రాలు
6. జన్యుపరివర్తన బంగాళాదుంప (పొటాటో) అయిన ప్రొటాటో (protato) వేటిని ఎక్కువగా కలిగి ఉంటుంది?
1) విటమిన్‌లు 2) ఖనిజ లవణాలు
3) ప్రొటీన్‌లు 4) కొవ్వులు
7. జన్యుపరివర్తన పురుష వంధ్యత్వం చూపే మొక్కల వల్ల ఉపయోగం?
1) పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది.
2) ఆత్మపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది.
3) ఫలాలు ఎక్కువగా ఏర్పడతాయి.
4) పుప్పొడి ఎక్కువగా ఏర్పడుతుంది.
8. ఫ్లావర్‌సావర్, ఎండ్‌లెస్ సమ్మర్ అనే జన్యు పరివర్తన టమాటాల ప్రత్యేకత?
1) అధిక దిగుబడిని ఇస్తాయి.
2) కీటకాలకు నిరోధకతను చూపుతాయి.
3) ఫలాల్లో అధిక గుజ్జు ఉంటుంది.
4) ఆలస్యంగా పక్వానికి వస్తాయి.
9. జన్యు ఇంజినీరింగ్ పద్ధతి ద్వారా ఏ రకమైన జన్యుపరివర్తన మొక్కలను సృష్టించవచ్చు?
1) ఒత్తిడిని తట్టుకునే మొక్కలు
2) జీవ విచ్ఛిన్న ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసే మొక్కలు
3) అధిక ఆవశ్యక అమైనో ఆమ్లాలు కలిగిన ధాన్యాలు
4) పైవన్నీ
10. జన్యుపరివర్తన మొక్కల్లో ప్రవేశపెట్టిన టర్మినేటర్ టెక్నాలజీ లేదా జెనెటిక్ యూజ్ టర్మినేటర్ టెక్నాలజీ ప్రత్యేకత?
1) 2వ తరంలోని విత్తనాలు మొలకెత్తవు
2) దిగుబడి పెరుగుతుంది
3) ఈ మొక్కలను కీటకాలు ఆశించవు
4) విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి
11. పత్తిలోకి ఏ జీవి నుంచి తీసిన జన్యువును ప్రవేశపెట్టి బీటీ పత్తిని సృష్టించారు?
1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) శిలీంధ్రం 4) ఏదీకాదు
12. బాసిల్లస్ తురియెంజెనిసిస్ అనే బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యువును మొక్కల్లో ప్రవేశపెట్టడం వల్ల కలిగే ఉపయోగం?
1) మొక్కలు అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి.
2) మొక్కల్లో విషపదార్థం ఉత్పత్తయి కీటకాలు ఆశించవు.
3) మొక్కల్లో అధిక పరాగసంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది.
4) ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియను చూపుతుంది.
13. భారతదేశంలో సాగుకు అనుమతి ఇచ్చిన ఒకే ఒక జన్యుపరివర్తన పంట?
1) బీటీ వంకాయ 2) జన్యుపరివర్తన ఆవాలు
3) బీటీ పత్తి 4) గోల్డెన్ రైస్
14. భారతదేశంలో ఏ జన్యు పరివర్తన కూరగాయ మొక్కకు క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతి ఇచ్చారు?
1) బీటీ టమాటా 2) గోల్డెన్ వంకాయ
3) బీటీ వంకాయ 4) బీటీ బెండ
15. బీటీ పత్తిని ఏ కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది?
1) డ్యూపాంట్, రాశి సీడ్స్
2) హిందుస్థాన్ లీవర్
3) మోన్‌శాంటో, ఇండియా సీడ్స్
4) మోన్‌శాంటో, మహికో
16. గోల్డెన్ రైస్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏ సూక్ష్మ పోషకం లభిస్తుంది?
1) విటమిన్ - తి 2) విటమిన్ - తీ12
3) విటమిన్ - దీ 4) విటమిన్ - ని
17. గోల్డెన్‌రైస్‌ను ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేశారు?
1) రక్తహీనత 2) గాయిటర్
3) ఆస్టియో పోరోసిస్ 4) పోషకాహార అంధత్వం
18. గోల్డెన్ రైస్‌లో బియ్యం బంగారు వర్ణంలో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం?
1) పత్రహరితం 2) బీటా కెరొటిన్
3) ఫైకోసయనిన్ 4) ఫైకోఎరిథ్రిన్
19. మొక్కల కణజాల వర్ధనం ద్వారా ఏర్పడిన శాఖీయ పిండభాల చుట్టూ సోడియం ఆల్జినేట్ పూతపూసి వేటిని రూపొందిస్తారు?
1) కృత్రిమ పిండాలు
2) కృత్రిమ విత్తనాలు
3) కృత్రిమ ఫలాలు
4) కృత్రిమ మొక్కలు
20. ఏ జన్యు పరివర్తన మొక్కల విత్తనాలను బోల్‌గార్డ్ విత్తనాలు అంటారు?
1) బీటీ పత్తి
2) బీటీ వంకాయ
3) జన్యుపరివర్తన వరి
4) జన్యుపరివర్తన మొక్కజొన్న
21. స్వదేశీ బీటీ పత్తిని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రిసెర్చ్ ఎవరితో కలిసి అభివృద్ధి చేసింది?
1) తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
2) యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - ధార్వాడ్
3) కర్ణాటక అగ్రికల్చరల్ యూనివర్సిటీ
4) తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ
22. బీటీ వంకాయను మోన్‌శాంటో, మహికో కంపెనీలు ఎవరితో కలిసి అభివృద్ధి చేశాయి?
1) యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - ధార్వాడ్
2) తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ
3) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటెబుల్ రిసెర్చ్ - వారణాసి
4) పైవన్నీ
23. దిల్లీ యూనివర్సిటీ శాస్త్రవేత్త దీపక్ కుమార్ పెంటల్ సృష్టించిన జన్యు పరివర్తన ఆవాలు దేనికి నిరోధకత చూపుతాయి?
1) గుల్మనాశక రసాయనాలు
2) కీటకాలు
3) వైరస్‌లు
4) శిలీంధ్రాలు
24. జన్యుపరివర్తన జంతువును సృష్టించడానికి పిండంలోకి ఏ వైరస్ ద్వారా జన్యువులను ప్రవేశపెడతారు?
1) బ్యాక్టీరియోఫేజ్ 2) జైమోఫేజ్
3) మైకోఫేజ్ 4) రిట్రోవైరస్
25. మొదటి జన్యుపరివర్తన జీవి సూపర్ మౌస్ (ఎలుక) ప్రత్యేకత?
1) ఎక్కువ కాలం జీవిస్తుంది.
2) వేగంగా ఎక్కువ బరువు పెరుగుతుంది.
3) అధిక సంతానోత్పత్తి
4) అతి చురుకుదనం
26. కింది ఏ రకమైన జన్యువులు ఉన్న జన్యుపరివర్తన చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు?
1) యాంటీఫ్రీజ్ ప్రొటీన్ జన్యువు
2) గ్రోత్ హార్మోన్ జన్యువు
3) గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్
4) పైవన్నీ
27. జన్యుపరివర్తన పందుల్లో ఉత్పత్తి అవుతున్న ఫ్యాక్టర్ - జుఖిఖిఖి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) హీమోఫీలియా వ్యాధిగ్రస్థుల్లో రక్తం గడ్డకట్టడానికి
2) రక్తహీనత ఉన్నవారిలో రక్తం ఉత్పత్తికి
3) అంధత్వం ఉన్నవారిలో కార్నియా ఏర్పడటానికి
4) విరిగిన ఎముకలను అతికించడానికి
28. జన్యుపరివర్తన కుందేలులో ఉత్పత్తయిన ఇంటర్‌ల్యుకేన్ - 2 అనే రసాయనాన్ని ఏ వ్యాధి చికిత్సకు వాడుతున్నారు?
1) మధుమేహం 2) పక్షవాతం
3) క్యాన్సర్ 4) డయేరియా
29. పర్యావరణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండే జన్యు ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ వేటిని నియంత్రిస్తుంది?
1) జన్యుపరివర్తన జీవులను
2) జన్యుపరివర్తన జీవుల నుంచి రసాయనాల పారిశ్రామిక ఉత్పత్తిని
3) జన్యుపరివర్తన జీవుల క్షేత్రస్థాయి ప్రయోగాలను
4) పైవన్నీ
30. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే రివ్యూ కమిటీ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్‌లో ఎవరు సభ్యులుగా ఉంటారు?
1) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఖిదితిళి)
2) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఖిదిలీళి)
3) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (దిళీఖిళి)
4) పైవన్నీ
31. కణజాల వర్ధనంలో పెరిగే కణాలకు యానకం వేటిని అందిస్తుంది?
1) విటమిన్‌లు 2) ఖనిజ లవణాలు
3) హార్మోన్‌లు 4) పైవన్నీ
32. జంతు కణజాల వర్ధనం ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) మృదులాస్థిని ఉత్పత్తి చేయడానికి
2) చర్మాన్ని ఉత్పత్తి చేయడానికి
3) ఔషధాల పని తీరును గుర్తించడానికి
4) పైవన్నీ
33. కణజాల వర్ధనంలో ద్రవ యానకాన్ని ఘనస్థితికి తీసుకురావడానికి దేన్ని ఉపయోగిస్తారు?
1) అగార్ - అగార్ 2) స్టార్చ్
3) సిలికా జెల్ 4) గ్లూకగాన్
34. మొక్క కణాన్ని కణజాల వర్ధనం ద్వారా పెంచితే అది పూర్తి మొక్కగా మారడాన్ని ఏమంటారు?
1) కణ ప్లూరిపొటెన్సీ 2) కణ టోటిపొటెన్సీ
3) కణ ప్లాంట్ పొటెన్సీ 4) కణ యూనిపొటెన్సీ
35. కణజాల వర్ధన ప్రయోగాల్లో యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడానికి ఏ పరికరాన్ని వాడతారు?
1) లామినార్ ఎయిర్ ఫ్లో 2) సెంట్రిప్యూజ్
3) ఆటోక్లేవ్ 4) హైబ్రిడైజర్
36. మొక్కల కణజాల వర్ధనం ద్వారా పెద్ద మొత్తంలో మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు?
1) సూక్ష్మ వ్యాప్తి (మైక్రో ప్రాపగేషన్)
2) మాస్ ప్రొడక్షన్
3) వెజిటేటివ్ ప్రొడక్షన్
4) క్లోనల్ ప్రాపగేషన్
37. మొక్కల కణజాల వర్ధనం ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) వైరస్ రహిత మొక్కల ఉత్పత్తికి
2) అరుదైన మొక్కల ఉత్పత్తికి
3) జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి
4) పైవన్నీ
సమాధానాలు
1-1; 2-2; 3-3; 4-4; 5-2; 6-3; 7-1; 8-4; 9-4; 10-1; 11-1; 12-2; 13-3; 14-3; 15-4; 16-1; 17-4; 18-2; 19-2; 20-1; 21-2; 22-4; 23-1; 24-4; 25-2; 26-4; 27-1; 28-3; 29-4; 30-4; 31-4; 32-4; 33-1; 34-2; 35-3; 36-1; 37-4.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Uttar Pradesh: అమానవీయ ఘటన.. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రి బయట బైక్‌పై పడేసి వెళ్లిపోయారు!
-
Dhruva Natchathiram: ఆరేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు సెన్సార్ పూర్తి..!
-
22,000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. మొబైల్ కాదిది పవర్ హౌస్!
-
England Team: అంతా అయోమయం.. 38 గంటలపాటు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణం: బెయిర్‌స్టో
-
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబరు 3న రాష్ట్రానికి సీఈసీ
-
Drones: డ్రోన్లతో భారత్‌లోకి మాదక ద్రవ్యాలు.. అడ్డుకున్న బీఎస్ఎఫ్