కరెంట్‌ అఫైర్స్‌

‘ది క్రూకెడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా: ఎస్సేస్‌ ఆన్‌ ఎ రిపబ్లిక్‌ ఇన్‌ క్రైసిస్‌’ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు.

Published : 01 Jun 2023 01:28 IST

మాదిరి ప్రశ్నలు

‘ది క్రూకెడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా: ఎస్సేస్‌ ఆన్‌ ఎ రిపబ్లిక్‌ ఇన్‌ క్రైసిస్‌’ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు?

జ: పరకాల ప్రభాకర్‌


దేశంలో ఘన, ద్రవ వ్యర్థాల ఉత్పత్తికి బాధ్యులైన వారే పరిహారం చెల్లించాలనే ప్రాతిపదికన రూ.4 వేల కోట్ల పర్యావరణ పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది? (ఇంతకు ముందు తెలంగాణ, మణిపుర్‌, దిల్లీ, కర్ణాటకలపై కూడా ఎన్‌జీటీ పర్యావరణ పరిహారం విధించింది. గతంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశాలను సర్వోన్నత న్యాయస్థానం విచారించేది. 2014లో సుప్రీంకోర్టు ఆ బాధ్యతలను ఎన్‌జీటీకి బదిలీ చేసింది.)

జ: బిహార్‌


రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దేశీయంగా ఎన్ని జలాశయాలకు జవజీవాలను కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ అమృత్‌ సరోవర్‌ పథక లక్ష్యం? (ప్రపంచ జనాభాలో 18 శాతానికి భారతదేశమే ఆవాసం. కానీ, విశ్వవ్యాప్త మంచినీటి వనరుల్లో భారత్‌ వాటా కేవలం 4 శాతం. దేశవ్యాప్తంగా ఇప్పటికే అరవైకోట్ల మంది నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. తరుముకొస్తున్న సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం ఈ అమృత్‌ సరోవర్‌ పథకాన్ని చేపట్టింది.)

జ: యాభైవేలు


సెల్‌ఫోన్ల చోరీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్‌ ఏది? (ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా పోయిన ఫోన్‌ పనిచేయకుండా ఆపేయడంతో పాటు దేశంలో ఎక్కడున్నా సులభంగా గుర్తించవచ్చు. దేశంలో ఏటా కోటిన్నర సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు అంచనా.)

జ: సంచార్‌ సాథీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు