కరెంట్‌అఫైర్స్‌

‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు’ను గెలుచుకున్న యూకేకు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌ ఎవరు

Published : 26 Mar 2024 00:45 IST

మాదిరి ప్రశ్నలు

‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు’ను గెలుచుకున్న యూకేకు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌ ఎవరు? (లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్‌ హిస్టరీ మ్యూజియం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. నార్వేలోని స్వాల్‌ బర్డ్‌ ద్వీప సమూహంలో ఉత్తర ధ్రువానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఒక చిన్న మంచు కొండ (ఐస్‌బర్గ్‌)పై నిద్రిస్తున్న ఎలుగుబంటిని ఈయన ఫొటో తీసి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ ఫొటోకు ‘ఐస్‌బెడ్‌’ అని పేరు పెట్టారు.) 

జ: నీమా సరిఖానీ


2024-25 మధ్యంతర బడ్జెట్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)లో భాగంగా సరికొత్త రంగాల్లో పరిశోధనల దిశగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంతో మూలనిధి (కార్పస్‌ ఫండ్‌)ని కేటాయించింది? (దీని నుంచి వడ్డీ లేకుండా, లేదంటే కనీస వడ్డీకి 50 ఏళ్ల కాల పరిమితితో రుణాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతికంగా ప్రతిభావంతులైన యువతను నవ కల్పన (ఇన్నోవేషన్‌) దిశగా ప్రోత్సహించడానికి ఈ మూలనిధిని వినియోగించడమే తమ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.)

జ: రూ.లక్ష కోట్లు


ఆసియాలో అతి పెద్ద ‘ట్రావెల్‌ ట్రేడ్‌ షో’ ప్రదర్శనను 2024, ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఏ నగరంలో నిర్వహించారు?

జ: ముంబయి (‘ఓటీఎం ముంబయి’ పేరిట ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఓటీఎం అంటే అవుట్‌ బౌండ్‌ ట్రావెల్‌ మార్ట్‌. భారత్‌తోపాటు మొత్తం 60 దేశాలకు చెందిన సుమారు 1300 స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు