కరెంట్‌ అఫైర్స్‌

గ్రీస్‌లో జరుగుతున్న 12వ అంతర్జాతీయ జంపింగ్‌ మీటింగ్‌లో భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో అతడు  8.31 మీటర్ల దూరం దూకి

Published : 28 May 2022 02:54 IST

అంతర్జాతీయ జంపింగ్‌ మీటింగ్‌లో శ్రీశంకర్‌కు స్వర్ణం

గ్రీస్‌లో జరుగుతున్న 12వ అంతర్జాతీయ జంపింగ్‌ మీటింగ్‌లో భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో అతడు  8.31 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. తన జాతీయ రికార్డు (8.36 మీ) కన్నా ఇది తక్కువే. ఇదే పోటీల్లో మోంట్‌లర్‌ (స్వీడన్‌, 8.27 మీ) రజతం గెలవగా, జులెస్‌ (ఫ్రాన్స్‌  8.17 మీ) కాంస్యం సాధించాడు.


ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు (ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేట్‌ - ఐఎంఆర్‌) తెలంగాణలో  గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వెయ్యి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా 2020 గణాంకాల్లో 21కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం (శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ - ఎస్‌ఆర్‌ఎస్‌)’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపరిచింది. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (28) కంటే తెలంగాణ (21)లో తక్కువగా నమోదైంది.


తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి రెండు వారాల్లో మూడుసార్లు జాతీయ రికార్డు బద్దలుకొట్టింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో సంచలన అథ్లెట్‌గా ఎదిగిన జ్యోతి మరోసారి జాతీయ రికార్డును సవరించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న డీ హ్యారీ షట్లింగ్‌ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌ పరుగును 13.04 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి తన పేరిటే ఉన్న రికార్డు (13.11 సె)ను అధిగమించింది.  


ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్‌ ఐబీఏ అథ్లెట్ల కమిటీ ఛైర్‌పర్సన్‌గా, ఓటింగ్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) తెలిపింది. మరో భారత బాక్సర్‌ శివ్‌ థాపా కూడా ఐబీఎ అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని