UPSC Civils 2024: సివిల్స్‌ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించింది.

Updated : 05 Mar 2024 20:22 IST

UPSC CSE 2024 Applications| దిల్లీ:  సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల గడువు మార్చి 5తో ముగియడంతో ఆ గడువును ఒక్కరోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 150 ఖాళీల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం పొడిగించింది. ఈ రెండు పరీక్షలకు ఇంకా దరఖాస్తు చేసుకోనివారు మార్చి 6న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే వెలుసుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. UPSC CSE 2024 ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షలు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని