NEET 2023: నీట్‌ పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ విడుదల .. ఇలా పొందండి..!

నీట్‌ యూజీ పరీక్ష మే 7న దేశవ్యాప్తంగా జరగనున్నవేళ ఎన్‌టీఏ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను విడుదల చేసింది. 

Updated : 30 Apr 2023 18:56 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్షకు గడువు సమీపిస్తోంది. మే 7న (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను విడుదల చేసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లో అభ్యర్థులు పరీక్ష రాసే నగరం, పరీక్ష తేదీ వివరాలు ఉంటాయి. ఈ వివరాల కోసం విద్యార్థులు neet.nta.nic.in వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడంతో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ పొందొచ్చు. అలాగే, తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. నీట్‌ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 18లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా.

నీట్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని