Teacher Jobs: నేడే లాస్ట్.. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచర్ పోస్టులు
ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్ పోస్టుల (Teaching Jobs) భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది.
అమరావతి: ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్ పోస్టుల (Teaching Jobs) భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
- మొత్తం ఖాళీలివే.. ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ 846; సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.
- విద్యార్హతలు.. ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.
- గౌరవ వేతనం: ప్రిన్సిపాళ్లకు రూ.34,139; సీఆర్టీలకు రూ.26,759; పీజీటీలకు రూ.26,759; పీఈటీలకు రూ.26,759 చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుంది.
- దరఖాస్తు రుసుము: రూ.100. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
- ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం, జిల్లాలు, సబ్జెక్టులు, రోస్టర్ వారీగా ఉద్యోగ ఖాళీలు, విద్యార్హతలు, వేతనం వంటి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి