UGC NET Applications: యూజీసీ నెట్‌ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు

యూజీసీ నెట్‌ (డిసెంబర్‌) పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థులు అక్టోబర్‌ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published : 27 Oct 2023 19:52 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2023 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత నిర్ణయించిన గడువు శనివారం (అక్టోబర్‌ 28)తో గడువు ముగియనుండటంతో ఎన్‌టీఏ-యూజీసీ తాజా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అభ్యర్థులు అక్టోబర్‌ 31వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://ugcnet.ntaonline.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, దరఖాస్తు రుసుం చెల్లింపు గడువును సైతం అక్టోబర్‌ 31వరకు వరకూ పొడిగించారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే నవంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు సరిచేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను డిసెంబర్‌ 6 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.  మొత్తం 83 సబ్జెక్టుల్లో జరిగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు