UPSC: డిగ్రీ ఉంటే చాలు.. సీఏపీఎఫ్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు!
UPSC CAPF 2023: కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలివే..
దిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో(Central Armed Police Forces) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 322 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలలో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఏ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి మే 16న సాయంత్రం 6గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ముఖ్యాంశాలివే..
- మొత్తం ఉద్యోగాలు 322 కాగా.. బీఎస్ఎఫ్లో (86), సీఆర్పీఎఫ్ (55), సీఐఎస్ఎఫ్ (91), ఐటీబీపీ (61), ఎస్ఎస్బీ (30) చొప్పున ఖాళీలను ఈపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
- అభ్యర్థులు డిగ్రీ తత్సమాన విద్యార్హతలతో పాటు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి. జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- అర్హులైన వారు మే 16వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 23వరకు సరిచేసుకొనేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజు రూ.200లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్‌లో ఉండే పరీక్షకు నెగెటివ్‌మార్కులు ఉంటాయి.
- రాత పరీక్ష ఆగస్టు 6న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సెంటర్లు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: పొన్నం ప్రభాకర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్‌లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు