UPSC: నేడే ఆఖరు.. డిగ్రీతో సీఏపీఎఫ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?
దిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో(Central Armed Police Forces) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు UPSC గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 322 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఈ పరీక్ష ద్వారా బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఏ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు మే 16 సాయంత్రం 6గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు..
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే మొత్తం ఉద్యోగాలు 322 కాగా.. బీఎస్‌ఎఫ్‌లో (86), సీఆర్‌పీఎఫ్ (55), సీఐఎస్‌ఎఫ్ (91), ఐటీబీపీ (61), ఎస్‌ఎస్‌బీ (30) చొప్పున ఉన్నాయి.
- అభ్యర్థులు డిగ్రీ తత్సమాన విద్యార్హతలతో పాటు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి. జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- అర్హులైన వారు మే 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 23వరకు సరిచేసుకొనేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజు రూ.200లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్‌లో ఉండే పరీక్షకు నెగెటివ్‌మార్కులు ఉంటాయి.
- రాత పరీక్ష ఆగస్టు 6న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సెంటర్లు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి