నిగనిగ దానిమ్మ!

చర్మం నిగనిగలాడాలని, ముడతలు పడకూడదని కోరుకుంటున్నారా? వృద్ధాప్యం త్వరగా మీద పడకూడదని భావిస్తున్నారా? అయితే రోజూ దానిమ్మ పండ్ల రసం తాగి చూడండి. మనకు అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి.

Updated : 01 Jun 2021 06:11 IST

చర్మం నిగనిగలాడాలని, ముడతలు పడకూడదని కోరుకుంటున్నారా? వృద్ధాప్యం త్వరగా మీద పడకూడదని భావిస్తున్నారా? అయితే రోజూ దానిమ్మ పండ్ల రసం తాగి చూడండి. మనకు అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్‌ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి చర్మం నిగనిగలాడటానికీ తోడ్పడతాయి. దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్‌) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది. చర్మం ముడతలు పడేది పైపొరలోనే మరి! ఒక్క చర్మ సౌందర్యం ఇనుమడించేలా చేయటమే కాదు.. వయసుతో పాటు ఇబ్బంది పెట్టే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు తగ్గిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని