మెదడుకూ మేలే

గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. తగినంత వ్యాయామం చేయాలి. పొగ అలవాటు జోలికి వెళ్లొద్దు. అతిగా మద్యం తాగొద్దు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు గుండెకే కాదు.

Updated : 02 Nov 2021 03:10 IST

గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. తగినంత వ్యాయామం చేయాలి. పొగ అలవాటు జోలికి వెళ్లొద్దు. అతిగా మద్యం తాగొద్దు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు గుండెకే కాదు. మెదడుకూ మేలు చేస్తాయి. తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా లేని వృద్ధులను పరిశోధకులు 21 ఏళ్ల పాటు పరిశీలించి దీన్ని కనుగొన్నారు. అధ్యయనం చివర్లో ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరుగా పొగ తాగటం, మద్యం అలవాటు, ఊబకాయం, కొలెస్ట్రాల్‌, రక్తపోటు వంటి గుండెజబ్బు ముప్పు కారకాలను నిశితంగా విశ్లేషించారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలనూ పరీక్షించారు. గుండెజబ్బు ముప్పు ఎక్కువగా గలవారిలో మెదడు సామర్థ్యమూ వేగంగా క్షీణిస్తూ వస్తున్నట్టు తేలటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని