ఎక్కిళ్లకు స్ట్రా చికిత్స

ఏడు గుటకల నీళ్లు తాగటం, ఊపిరి బిగపట్టటం, కాగితపు సంచీలోకి గాలి ఊదటం, నిమ్మకాయ ముక్క చప్పరించటం.. ఇలా ఎక్కిళ్లు తగ్గటానికి ఎవరికి తోచిన చిట్కాలు వారు పాటిస్తుంటారు.

Published : 29 Jun 2021 01:16 IST

డు గుటకల నీళ్లు తాగటం, ఊపిరి బిగపట్టటం, కాగితపు సంచీలోకి గాలి ఊదటం, నిమ్మకాయ ముక్క చప్పరించటం.. ఇలా ఎక్కిళ్లు తగ్గటానికి ఎవరికి తోచిన చిట్కాలు వారు పాటిస్తుంటారు. ఇవి ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు గానీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ ఎక్కిళ్లకు ప్రత్యేకమైన స్ట్రాను రూపొందించారు. ఎల్‌ ఆకారంలో, గట్టిగా ఉండే దీన్ని గ్లాసులో పెట్టి.. వెంట వెంటనే మూడు సార్లు నీళ్లు తాగాల్సి ఉంటుంది. స్ట్రా అడుగున కవాటం ఉంటుంది. అందువల్ల చాలా గట్టిగా నీటిని పీల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడు కడుపు, ఛాతీ కుహరానికి మధ్యలో ఉండే డయాఫ్రం పొర కిందికి దిగుతుంది. శ్వాసనాళంలోకి ఆహారం వెళ్లకుండా అడ్డుపడే ఎపిగ్లోటస్‌ మూసుకుంటుంది. అదే సమయంలో ఫ్రెనిక్‌, వేగస్‌ నాడులు ప్రేరేపితమవుతాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దటానికి మెదడుకు అవకాశం లభిస్తుంది. ఎక్కిళ్లు ఆగిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని