మధుమేహానికి ఛీజ్, పెరుగు కళ్లెం

రోజుకు రెండు సార్లు ఛీజ్, పెరుగు లేదా గుడ్లు తింటే మధుమేహం వచ్చే అవకాశం తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కెనడాలోని మెక్‌ మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అలాగే రోజుకు రెండు

Updated : 27 Sep 2022 12:16 IST

రోజుకు రెండు సార్లు ఛీజ్, పెరుగు లేదా గుడ్లు తింటే మధుమేహం వచ్చే అవకాశం తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కెనడాలోని మెక్‌ మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అలాగే రోజుకు రెండు సార్లు పాల పదార్థాలు తీసుకుంటే రక్తపోటు, గుండెజబ్బుతో ముడిపడిన సమస్యలూ తగ్గుతున్నట్టు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో మొత్తం 21 దేశాలకు చెందిన 1.4 లక్షల మంది ఆహార అలవాట్లను తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు. పెరుగు వంటి పాల పదార్థాలు తీసుకోవటానికీ జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) తగ్గటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు తేల్చారు. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలన్నీ మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కిందికే వస్తాయి. పాల పదార్థాలను రోజుకు రెండు సార్లు తినేవారిలో జీవక్రియ రుగ్మత 24% మేరకు తగ్గుతున్నట్టు బయటపడింది. అందుకే దీనిపై పెద్దఎత్తున ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిల్లోనూ ఇది రుజువైనట్టయితే తక్కువ ఖర్చుతోనే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులను తగ్గించుకునే కొత్త పద్ధతిగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని