ఆహా అయోడిన్!
వంటకాలకు రుచిని తెచ్చిపెట్టే అయోడిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిండం ఏర్పడే స్థితి నుంచీ జీవితంలో ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
వంటకాలకు రుచిని తెచ్చిపెట్టే అయోడిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిండం ఏర్పడే స్థితి నుంచీ జీవితంలో ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని జబ్బుల చికిత్స, నివారణకూ తోడ్పడుతుంది. మరి అయోడిన్ గొప్పతనమేంటో తెలుసుకుందామా.
అయోడిన్‌ను అయోడైడ్ అనీ అంటారు. మట్టి, సముద్రాల్లో సహజంగా ఉండే దీన్ని ఇప్పుడు ఉప్పులో కలిపి అమ్మటం చూస్తూనే ఉన్నాం. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, మెదడు ఎదుగుదల, చురుకుదనం, శ్వాస, గుండె వేగం, జీవక్రియ, జీర్ణక్రియ వంటి పనులకు థైరాయిడ్ హార్మోన్లు తప్పనిసరి. అయోడిన్ లేకపోతే మన శరీరం వీటిని తయారు చేసుకోలేదు. దీని మోతాదులను బట్టే థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతుంటాయి. థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. ఇందులో థైరాయిడ్ గ్రంథి ఉబ్బుతుంది. దీంతో మెడ కింద వాచినట్టు కనిపిస్తుంది.
- పిల్లలు సరిగా తినకపోతే వారికి తగినంత అయోడిన్ లభించేలా చూడటం మంచిది. అయోడిన్ లోపిస్తే పిల్లల ఆలోచనా విధానం, కార్యకారణ వివేచన నైపుణ్యాలు కొరవడతాయి. దీర్ఘకాలం అయోడిన్ లోపం గల పిల్లల్లో మెదడు ఎదుగుదల కుంటుపడే ప్రమాదముంది.
- కొందరు మహిళల రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి నొప్పి పెడుతుంటాయి కూడా. వీటికి అయోడిన్ లోపమూ కారణం కావొచ్చు.
- అయోడిన్ ఎంత అవసరమనేది వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆరు నెలల్లోపు పిల్లలకు 110 మైక్రో గ్రాములు, 7-12 నెలల్లో 130 మై.గ్రా., 1-8 ఏళ్లలో 90 మై.గ్రా., 9-13 ఏళ్లలో 120 మై.గ్రా., 14-18 ఏళ్లలో 150 మై.గ్రా., పెద్దవారికి 150 మై.గ్రా., గర్భిణులకు 220 మై.గ్రా., పాలిచ్చే తల్లులకు 290 మై.గ్రా., అవసరం.
- సమతులాహారం తీసుకుంటే తగినంత అయోడిన్ అందేలా చూసు కోవచ్చు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ దండిగా ఉంటుంది. ప్రస్తుతం అయోడిన్ కలిపిన ఉప్పు విరివిగా లభిస్తోంది కూడా. అయితే అయోడిన్ కోసం ఉప్పు ఎక్కువగా తినటం తగదు. ఉప్పు మితిమీరితే ఇతరత్రా జబ్బులకు దారితీస్తుంది మరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్