నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌ : చంటీ.. నీ పుట్టినరోజు ఎప్పుడు?

Published : 17 Feb 2022 00:24 IST

అలా అర్థమైందా?

టీచర్‌ : చంటీ.. నీ పుట్టినరోజు ఎప్పుడు?

చంటి : అక్టోబర్‌ 27న టీచర్‌..

టీచర్‌ : ఏ సంవత్సరం?

చంటి : ప్రతి సంవత్సరం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అవసరం మరి!

టీచర్‌ : ‘నారు పోసిన వాళ్లే నీరు పోస్తారు’ లాంటి సామెత మరొకటి చెప్పు నానీ..

నాని : ‘ఫోన్‌ లేదా మెసేజ్‌ చేసేవారే రీఛార్జీ కూడా చేయించాలి’ టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

ఈ పెద్దోళ్లున్నారే..!

మావయ్య : ఏమైంది మిట్టూ.. అలా దిగులుగా కూర్చున్నావు?

మిట్టు : మీ పెద్దవాళ్లతో మాలాంటి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు మావయ్యా..

మావయ్య : అసలు విషయమేంటో చెప్పు ముందు..

మిట్టు : ఫోన్‌ పాడైతే పిల్లలు పాడు చేశారంటారు.. అదే, పిల్లలు పాడైతే ఫోన్‌ పాడు చేసిందంటారు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని