నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌: పిల్లలూ... పాఠం విన్నారుగా. ఇప్పుడు మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి.

Updated : 28 Feb 2022 06:29 IST

ఇదేం అనుమానం!

టీచర్‌: పిల్లలూ... పాఠం విన్నారుగా. ఇప్పుడు మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి.

పింకీ: ఇంతకీ మీరు చెప్పింది ఏ సబ్జెక్టు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


పాయింటే సుమా!

అమ్మ: ఏంటి టింకూ.. చేతిలో మాస్క్‌ పెట్టుకుని తెగ ఆలోచిస్తున్నావ్‌?

టింకు: ఏం లేదు అమ్మా.. మనం మాస్క్‌ పెట్టుకోకుంటే కరోనా వచ్చే అవకాశం ఉంది కదా!

అమ్మ: అవును టింకూ..! జనాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌ పెట్టుకోకుంటే కరోనా రావొచ్చు.

టింకు: ఆ మాస్కేదో మనమందరం పెట్టుకునే బదులు... కరోనాకే పెడితే సరిపోతుంది కదా.. ఇంత బాధ ఉండదు కదా!

అమ్మ: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని