నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: వానా వానా వందనం..  మాకు సెలవులు ఇచ్చావ్‌ వందనం..  

Published : 13 Jul 2022 01:05 IST

వానా వానా.. వందనం!

(టీవీ చూస్తూ చింటూ ఇలా పాట పాడుతున్నాడు)

చింటు: వానా వానా వందనం..  మాకు సెలవులు ఇచ్చావ్‌ వందనం..  
వానా వానా వందనం..  ఇంకొన్ని సెలవులు ఇవ్వు వందనం..  
ఈసారి కరోనా ఇవ్వకున్నా..  నువ్వు మాత్రం ఇచ్చావు  వందనం..
వానా వానా వందనం! వానా వానా వందనం!

నాన్న: ఆఁ!!

చదువంటే అంతిష్టమా!

టీచర్‌: బంటీ.. రోజూ రాత్రి ఏ టైం వరకు చదువుకుంటున్నావు?
బంటి: రాత్రి 11.30 వరకు చదువుకుంటున్నా టీచర్‌..

టీచర్‌: గుడ్‌... నీకు చదువు అంటే అంత ఇష్టమా..?
బంటి: అవును టీచర్‌... 11:20 వరకు టీవీ చూసి, 11:20 నుంచి 11:30 వరకు శ్రద్ధగా చదువుకుంటున్నా టీచర్‌..

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని