నవ్వుల్‌...! నవ్వుల్‌...!

చిట్టి : మిట్టీ.. రాత్రిళ్లు కాఫీ తాగితే నాకు నిద్రపట్టడం లేదు.. మిట్టి : అవునా.. నేనైతే దానికి పూర్తి వ్యతిరేకం..

Published : 17 Sep 2022 00:15 IST

పూర్తి వ్యతిరేకం

చిట్టి : మిట్టీ.. రాత్రిళ్లు కాఫీ తాగితే నాకు నిద్రపట్టడం లేదు..
మిట్టి : అవునా.. నేనైతే దానికి పూర్తి వ్యతిరేకం..
చిట్టి : అంటే..?
మిట్టి : ఒకసారి నిద్రపడితే.. ఇక కాఫీ తాగలేను..
చిట్టి : ఆ..!!

విషయం అదన్నమాట..

టీచర్‌ : రమా.. నారింజకూ బత్తాయికి తేడా ఏంటో చెప్పు?
రమ : రంగు టీచర్‌..
టీచర్‌ : అదేంటి?
రమ : నారింజ కాయల రంగు నారింజే.. కానీ, బత్తాయిల రంగు బత్తాయి కాదు..
టీచర్‌ : ఆ..!!

చాలా సింపుల్‌!

అంకుల్‌ : టింకూ.. అసలు చదువంటే ఏంటో తెలుసా నీకు?
టింకు : ఓ.. బాగా తెలుసు అంకుల్‌..
అంకుల్‌ : ఏంటో చెప్పు?
టింకు : పుస్తకాల్లోనిదంతా బుర్రలోకి ఎక్కించడం.. తరవాత ఆ బుర్రలోనిదంతా పరీక్ష పేపర్లలోకి దించడం..  
అంకుల్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని