ఒక చెంచా... బోలెడు పనులు!

అల్లం, వెల్లుల్లిని తురిమి పెడుతుంది. గుడ్డులోని పచ్చసొనను వేరు చేయడంతోపాటు చక్కగా గిలక్కొడుతుంది. కూరగాయలను నీళ్ల నుంచి వేరు చేస్తుంది. అన్నం కలపడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పనులు చేయడానికి బోలెడు వంట

Updated : 17 May 2022 17:17 IST

అల్లం, వెల్లుల్లిని తురిమి పెడుతుంది. గుడ్డులోని పచ్చసొనను వేరు చేయడంతోపాటు చక్కగా గిలక్కొడుతుంది. కూరగాయలను నీళ్ల నుంచి వేరు చేస్తుంది. అన్నం కలపడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పనులు చేయడానికి బోలెడు వంట సామాను కావాలేమో అనుకుంటున్నారా... అక్కర్లేదు... ఒక్క చెంచా ఉంటే చాలు...ఈ ‘మల్టీ ఫంక్షనల్‌ కిచెన్‌ కుకింగ్‌ స్పూన్‌’ అన్ని పనులనూ చేసేస్తుంది. 

అల్లం, వెల్లుల్లి  గ్రైండ్‌ చేయడానికి అనువుగా దీంట్లో ప్రత్యేక నిర్మాణం ఉంది. అలాగే ఈ చెంచాకు ఉండే రంధ్రాల ద్వారా గుడ్డులోని తెల్లసొన కిందకు పోయి పచ్చసొన గరిటెలోనే ఉండిపోతుంది. ఆలూ, బీన్స్‌ లాంటి ఉడికిన ఆహార పదార్థాలను దీని అడుగు భాగంతో మెత్తగా మెదపొచ్చు. తేలికగా ఉండే ఈ  చెంచా అధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకునేలా తయారుచేశారు. శుభ్రం చేయడమూ తేలికే. బాగుంది కదూ.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని