పోపులపెట్టె... భలే స్మార్ట్‌!

మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను పోపులపెట్టెలో భద్రపరుస్తాం.  అయితే వాటిని తీసుకునేటప్పుడు ఎందులో ఏముందో తెలియక తికమకపడుతుంటాం.

Updated : 12 Aug 2022 14:13 IST

సౌకర్యం

సాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను పోపులపెట్టెలో భద్రపరుస్తాం.  అయితే వాటిని తీసుకునేటప్పుడు ఎందులో ఏముందో తెలియక తికమకపడుతుంటాం. కానీ ఈ ‘రోటరీ స్పైస్‌ హోల్డర్‌’ మన దగ్గర ఉంటే అలాంటి ఇబ్బందే ఉండదు. ఇందులో మొత్తం పన్నెండు బాక్సులు ఉంటాయి. ఎందులో ఏం పెట్టాలో దాన్ని మీదే రాసి ఉంటుంది. బాక్సులో రెండు బటన్లు ఉంటాయి. వీటిని నొక్కితే నేరుగా పావు స్పూన్‌, అర స్పూన్‌ మీకు కావాల్సినంత పరిమాణంలో మసాలా దినుసులను తీసుకోవచ్చు. ఈ బాక్సులను సులువుగా వేరుచేయొచ్చు. కావాలంటే ఈ బాక్సుల మీద ఇంకో పన్నెండు బాక్సులను కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు అవసరమైన వాటిని తీసుకోవడానికి వీలుగా దీన్ని సులభంగా తిప్పొచ్చు. మీకూ నచ్చిందా మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని