చిట్టి టైమర్‌ గట్టిగా పిలుస్తుంది!

అప్పుడప్పుడూ పాలు పొంగిపోవడం, ఎప్పుడో ఒకప్పుడు అన్నం మాడటం... లాంటి ఇబ్బందులు ఇల్లాలికి అలవాటే. దీంతో ఆహార పదార్థాలు వృథా కావడమే కాకుండా.. స్టవ్‌ పరిసరాలు, పాత్రలను శుభ్రం చేయడం లాంటి పనులతో....

Published : 05 Dec 2021 01:28 IST

ప్పుడప్పుడూ పాలు పొంగిపోవడం, ఎప్పుడో ఒకప్పుడు అన్నం మాడటం... లాంటి ఇబ్బందులు ఇల్లాలికి అలవాటే. దీంతో ఆహార పదార్థాలు వృథా కావడమే కాకుండా.. స్టవ్‌ పరిసరాలు, పాత్రలను శుభ్రం చేయడం లాంటి పనులతో శ్రమ కూడా పెరుగుతుంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టేయడానికి వచ్చిందో చిట్టి టైమర్‌..

‘బన్నీ మెకానికల్‌ టైమర్‌’ గా పిలిచే ఈ పరికరం చేతిలో పట్టేంత సైజులో, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, తెలుపు రంగుల్లో లభ్యమవుతుంది. బ్యాటరీల అవసరం కూడా లేదు. దీంట్లో గంట వరకు టైమ్‌ (అలారం)ను సెట్‌ చేసుకోవచ్చు. మొదట 55 నుంచి 60 నిమిషాలకు సవ్యదిశ (క్లాక్‌వైజ్‌)లో తిప్పి, ఆ తర్వాత కావాల్సిన సమయాన్ని సెట్‌ చేయడానికి అపసవ్యదిశలో తిప్పాలి.

బోలెడు పనులతో సతమతమయ్యే గృహిణులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వంటగదిలో బిజీగా ఉన్నప్పుడు ఈ టైమర్‌ వంట విషయంలో మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. బేకింగ్‌, వేపుడు, కుకీలు, కేక్‌ల తయారీ, గుడ్లు ఉడికించడం... లాంటి వాటికి టైమర్‌ సాయాన్ని తీసుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్‌ మాగ్నెటిక్‌ స్టికర్‌గానూ వాడుకోవచ్చు. బాగుంది కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని