గ్లాసుల కోసం...

వంట చేసిన పాత్రలన్నింటినీ సింకులో వేసి, డిష్‌వాషర్‌తో తోమి శుభ్రం చేస్తాం. గ్లాసులు, బాటిళ్ల విషయానికొస్తే వాటిని తోమాల్సిన అవసరం ఉండదు. కేవలం నీళ్లతో శుభ్రం చేస్తే చాలు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన పరికరమే గ్లాస్‌ రిన్సర్‌ పరికరం.

Published : 18 Sep 2022 01:02 IST

వంట చేసిన పాత్రలన్నింటినీ సింకులో వేసి, డిష్‌వాషర్‌తో తోమి శుభ్రం చేస్తాం. గ్లాసులు, బాటిళ్ల విషయానికొస్తే వాటిని తోమాల్సిన అవసరం ఉండదు. కేవలం నీళ్లతో శుభ్రం చేస్తే చాలు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన పరికరమే గ్లాస్‌ రిన్సర్‌ పరికరం. దీన్ని సింకు పక్కనే అమర్చుకోవచ్చు. గుండ్రంగా, వెడల్పుగా ఉండే ఈ పరికరంపై గ్లాసును ఉంచి ఒత్తితే చాలు. నీళ్లు వేగంగా వచ్చి గ్లాసు లోపలి భాగాల్ని శుభ్రం చేస్తాయి. ఇది కేవలం గ్లాసుల కోసమే కాదు... బాటిళ్లు, సీసాల మూతలు శుభ్రం చేయడానికీ  ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని