కొత్తిమీర తిందాం..ఆరోగ్యంగా ఉందాం..

కొత్తిమీరను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఆ పరిమళం అలాంటిది. కూర, చారు, పచ్చడి.. ఎందులో వేసినా.. దాని రుచి రెట్టింపైపోతుంది. ఇది రుచికే కాదండోయ్‌, ఆరోగ్యానికీ మంచిదే. కొత్తిమీర తినడం వల్ల ఎన్ని లాభాలు చేకూరతాయో చూడండి..

Updated : 11 Feb 2024 01:22 IST

కొత్తిమీరను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఆ పరిమళం అలాంటిది. కూర, చారు, పచ్చడి.. ఎందులో వేసినా.. దాని రుచి రెట్టింపైపోతుంది. ఇది రుచికే కాదండోయ్‌, ఆరోగ్యానికీ మంచిదే. కొత్తిమీర తినడం వల్ల ఎన్ని లాభాలు చేకూరతాయో చూడండి..

 కొత్తిమీర మంచి పోషకాహారం. విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం విస్తారంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. ఇందులోని ఎ-విటమిన్‌ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్‌ కంటి కింది నల్లటి వలయాలను పోగొడుతుంది. రోజూ కాస్త కొత్తిమీర తినడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఓస్టియోపొరాసిస్‌ లాంటి సమస్యలు తలెత్తవు. ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్లజబ్బులు తగ్గుతాయి. కొత్తిమీర నరాలకు, కాలేయానికి, ఊపిరితిత్తులకు మంచిది. ఇది నోటిపూతను, మూత్రపిండాల్లో రాళ్లను నిరోధిస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ బాగుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దాంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, మతిమరపును రానివ్వదు. క్యాన్సర్‌ను సైతం నివారించే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న కొత్తిమీరను ఏదో రూపంలో తరచూ తిందాం, ఆరోగ్యంగా ఉందాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని