హాజ్‌మోలా చాయ్‌!

టీలో మీకెన్ని రకాలు తెలుసు? బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, రోజ్‌టీ...ఇంకా మరికొన్ని రకాలై ఉండొచ్చు కదా! ఇవే కాదు మనదేశంలో ఏ మూలకెళ్లినా ఆ ప్రాంతాన్ని బట్టి ఓ ప్రత్యేకమైన చాయ్‌ దొరుకుతుంది. అవేంటో తెలుసుకోవాలని మీకూ ఉందా

Updated : 03 Jul 2022 05:54 IST

టీలో మీకెన్ని రకాలు తెలుసు? బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, రోజ్‌టీ...ఇంకా మరికొన్ని రకాలై ఉండొచ్చు కదా! ఇవే కాదు మనదేశంలో ఏ మూలకెళ్లినా ఆ ప్రాంతాన్ని బట్టి ఓ ప్రత్యేకమైన చాయ్‌ దొరుకుతుంది. అవేంటో తెలుసుకోవాలని మీకూ ఉందా? అయితే ఈ హాజ్‌మోలా చాయ్‌ గురించి తెలుసుకోండి!

హాజ్‌మోలా చాయ్‌నే బెనారసీ చాయ్‌ అని కూడా అంటారు. బెనారస్‌లోని ఘాట్స్‌ వద్ద ప్రత్యేకంగా దొరుకుతుంది కాబట్టే దీనికా పేరు వచ్చింది. చాలామంది జీర్ణశక్తిని పెంచుకోవడానికి హాజ్‌మోలా ఆయుర్వేద మాత్రల్ని వాడుతుంటారు. ఆ మాత్రలనే లెమన్‌ చాయ్‌లో వేస్తారు. వాటితోపాటు నిమ్మరసం, పుదీనా ఆకులు, జీలకర్ర వేసి ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఉప్పగా, పుల్లగా ఉండే ఈ చాయ్‌ని కాశీ వెళ్లిన వాళ్లు ఇష్టంగా తాగుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని