కొవ్వును కరిగించాలా?

శొంఠిపొడి వేసి టీ కాస్తే.. ఆ రుచి భలే పసందుగా ఉంటుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కూడా.

Published : 27 Nov 2022 00:16 IST

శొంఠిపొడి వేసి టీ కాస్తే.. ఆ రుచి భలే పసందుగా ఉంటుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కూడా. ఇవే కాదు శొంఠితో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండోయ్‌!

* రోజూ కాసింత శొంఠిపొడిని ఆహారంలో చేర్చుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే వాళ్లకి చక్కని ఉపశమనం దొరుకుతుంది. మొదటి మూడు రోజులు శొంఠిపొడి వేసిన అన్నం తింటే నొప్పి కూడా తగ్గుతుంది.  
* కాలి పిక్కలు పట్టేయడం, కండరాల నొప్పులతో బాధపడటం వంటి సమస్యలుంటే ఇది మంచి ఔషధం.
* కొవ్వుని కరిగించడంలో శొంఠి ముందుంటుంది. ట్రైగ్లిజరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు.. కొన్ని రోజులు శొంఠి టీ తాగితే చక్కని ఫలితం కనిపిస్తుందట.
* శరీరం లోపలి వాపులకి, కీళ్లదగ్గర పట్టేసిట్టుగా ఉన్నా ఇది మేలు చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని