పింక్‌ చాయ్‌...!

గులాబీ రంగులో ఉన్న పానీయం ఏంటా అనుకుంటున్నారా? ఇది కశ్మీర్‌ ప్రత్యేకం.. పింక్‌ చాయ్‌.

Published : 27 Nov 2022 00:16 IST

గులాబీ రంగులో ఉన్న పానీయం ఏంటా అనుకుంటున్నారా? ఇది కశ్మీర్‌ ప్రత్యేకం.. పింక్‌ చాయ్‌. దీన్నే నన్చాయ్‌ అని కూడా అంటారు. శీతాకాలం ప్రత్యేకంగా దీనిని తయారుచేస్తారు...

చూడచక్కని రంగు మాత్రమే కాదు పోషకాలు కూడా అందిస్తుందీ పింక్‌ చాయ్‌. అందుకే ఈ గులాబీచాయ్‌ని సీజన్‌లో ఒక్కసారైనా తాగాలనుకుంటారు. ఇంత రంగుంది కాబట్టి దీనిలో ఏవో ఫుడ్‌ కలర్స్‌ని కలిపారనుకుంటే పొరపాటు. పోషకాలని కోల్పోకుండా నీడలో ఆరబెట్టిన తేయాకుకి బేకింగ్‌ సోడాని ప్రత్యేకమైన పద్ధతిలో కలపడం వల్ల ఆ రంగు వస్తుంది. అలాగే ఉప్పు, మసాలాల్లో వాడే స్టార్‌అనైజ్‌, యాలకులు, దాల్చిన చెక్క, బాదం, వాల్‌నట్స్‌, కుంకుమ పువ్వు వాడి చేస్తారు. శీతాకాలం ఎదురయ్యే అనేక అనారోగ్య సమస్యల నుంచి ఈ చాయ్‌ రక్షిస్తుందని, సాయంత్రం పూట రొట్టెతోపాటు ఈ చాయ్‌ని తాగుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని