పోషకాలు పోనివ్వని.. మైనం కాగితాలు!

వంటంతా అయిపోయిన తర్వాత వాటిని వేరే పాత్రల్లోకి మార్చి.. వేడి చల్లారకుండా ఉండేందుకుపైన మూతలు పెడతాం. ఫ్రిజ్‌లో దాచాలంటే కవర్లలో చుడతాం.

Published : 05 Feb 2023 00:43 IST

వంటంతా అయిపోయిన తర్వాత వాటిని వేరే పాత్రల్లోకి మార్చి.. వేడి చల్లారకుండా ఉండేందుకుపైన మూతలు పెడతాం. ఫ్రిజ్‌లో దాచాలంటే కవర్లలో చుడతాం. ఈమధ్యకాలంలో సిల్వర్‌ఫాయిల్‌ కాగితాలని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పదార్థాలకు గాలి ఆడక రుచినీ, పోషకాలనీ కోల్పోతాయి. బదులుగా ఫ్రిజ్‌లో కాయగూరలని కూరగిన్నెలని ఉంచడానికి మైనం కాగితాలు బీక్స్‌ వాక్స్‌ పేపర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ కాగితాల వల్ల పదార్థాలు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. ఈ కాగితాలని శుభ్రం చేసి మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. సిల్వర్‌ ఫాయిల్‌లా కాకుండా ఇవి త్వరగా నేలలో కలిసిపోయి పర్యావరణ చిక్కులు లేకుండా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని