ఐస్‌ క్యూబ్స్‌ తేలిగ్గా!

నెమ్మదిగా ఎండ పెరుగుతోంది! అంటే ఇంట్లోని ఫ్రిజ్‌లకి పని పెరుగుతుంది. జ్యూసుల కోసం, చల్లని నీళ్లకోసం ఇంతవరకూ పక్కన పెట్టేసిన ఐస్‌ట్రేల దుమ్ము దులుపుతాం.

Published : 05 Feb 2023 00:44 IST

నెమ్మదిగా ఎండ పెరుగుతోంది! అంటే ఇంట్లోని ఫ్రిజ్‌లకి పని పెరుగుతుంది. జ్యూసుల కోసం, చల్లని నీళ్లకోసం ఇంతవరకూ పక్కన పెట్టేసిన ఐస్‌ట్రేల దుమ్ము దులుపుతాం. అయితే వీటితో ఓ చిక్కుంది. వాటిలో నీళ్లుపోసి అవి ఒలగకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరిగి ఆ ఐస్‌క్యూబ్స్‌ని తీసేటప్పుడు కూడా ఇబ్బందే. ఒక్కో క్యూబ్‌నీ సేకరించాలి. ఈ ఐస్‌ జీనీతో మీకా బాధలేదు. చూడ్డానికి గుండ్రని డబ్బాలా ఉండే ఈ జీనీలో నీళ్లు నింపడం తేలిక. క్యూబ్స్‌ కావాల్సివచ్చినప్పుడు కొద్దిగా షేక్‌ చేస్తే చాలు. అందులోనే క్యూబ్స్‌ పేరుకుంటాయి. అవసరమైన వాటిని తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్‌ బాటిళ్లను అందులో ఉంచినా చల్లబడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని