గురువును ఉల్లంఘించిన శిష్యుడు

సాధారణంగా అందరూ తమ స్వార్థమే చూసుకుంటారు. తాము సుఖంగా బతకాలి, ఇతరులు ఏమైపోతే తమకేమిటి అనుకుంటారు. అంతేతప్ప పరుల మేలు కోరి తమ లాభం వదులుకోరు.

Updated : 27 Apr 2023 04:02 IST

సాధారణంగా అందరూ తమ స్వార్థమే చూసుకుంటారు. తాము సుఖంగా బతకాలి, ఇతరులు ఏమైపోతే తమకేమిటి అనుకుంటారు. అంతేతప్ప పరుల మేలు కోరి తమ లాభం వదులుకోరు. కానీ రామానుజాచార్యులు తన జీవన విధానంతో వ్యక్తి సుఖం కంటే వ్యవస్థ మేలు కోరడం మేలన్నాడు.

రామానుజులు తన గురువు గోష్ఠిపూర్ణుడి వద్ద తారకమంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని అన్యులకు ఉపదేశించకూడదు, నియమం గనుక ఉల్లంఘిస్తే నరకం తప్పదని హెచ్చరించిన తర్వాతే గురువు మంత్రం నేర్పాడు. కానీ రామానుజులు మర్నాడు రంగనాథ ఆలయం గోడ మీదికి ఎక్కి ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని అందరికీ ఉపదేశించాడు.

గురువు కోపంగా ‘నియమోల్లంఘన చేశావు, నరకానికి వెళ్తావు’ అంటే.. ‘గురువర్యా! ఈ మంత్రం విన్న వేలాదిమంది వైకుంఠానికి వెళ్లే అవకాశం కలిగినప్పుడు.. నేనొక్కణ్ణి నరకానికి వెళ్తే మాత్రమేం?’ అంటూ బదులిచ్చాడు. వ్యక్తిగా తనకు శిక్ష పడినా వ్యవస్థలో అనేక మందికి మేలు కలుగుతుందనుకున్న రామానుజుల ఆచరణీయ వ్యక్తిత్వం ఆదర్శనీయం. తమ సుఖం కంటే వ్యవస్థ కోసం కష్టపడటానికే ఉత్తములు సిద్ధపడతారు.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని