కర్ణుడు దుష్టుడెలా అయ్యాడు?

ఒకరోజు రాత్రివేళ అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుని చూడటానికి కర్ణుడు వచ్చాడు.

Published : 09 May 2024 00:14 IST

కరోజు రాత్రివేళ అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుని చూడటానికి కర్ణుడు వచ్చాడు. కుశలసమాచారం అయ్యాక ‘మహాశయా! నాలో ఇంత వీరత్వం, దానగుణం ఉన్నప్పటికీ కొందరు నన్ను తక్కువచేసి చూస్తున్నారు. ఎందుకలా? నన్ను అర్జునుడితో సమానంగా ఎందుకు పరిగణించడం లేదు?’ అనడిగాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ భీష్మపితామహుడు-

జాతోసి ధర్మ లోపేన తతస్తే బుద్ధిరీదృశీ
నీచాశ్రయాన్మత్సరేణ ద్వేషిణీ గుణినామపి

నీ జననంలోనే ధర్మలోపం ఉంది. అందువల్లే నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. ఎంతటి గుణ సంపన్నులైనా నీచ బుద్ధి కలవారిని ఆశ్రయిస్తే.. వారి మనసు కూడా ఈర్ష్య, ద్వేషాలతో నిండుతుంది. దుర్యోధనాదుల సాంగత్యం కారణంగానే లోకులు నిన్ను కూడా లోకువగా చూస్తున్నారు- అంటూ బదులిచ్చాడు. దారానికి పరిమళం ఉండదు. కానీ కుసుమాలను గుచ్చిన దారానికి సువాసన అబ్బుతుంది. అందువల్ల మనం దుష్టబుద్ధి ఉన్నవారితో కాకుండా సుగుణ సంపన్నుల సాన్నిధ్యంలో గడిపేందుకు ప్రయత్నించాలి. ధర్మానికి హాని కలిగే పనులు చేయకూడదు. అలాంటి వారితో చెలిమి కూడా తగదని గ్రహించాలి- అంటూ వివరించాడు.  

శివలెంక ప్రసాదరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని