విధాత

విష్ణుసహస్రనామావళిలో ఇది 44 వది. ధాత నామం వలెనే విధాత నామానికీ విశిష్టమైన అర్థం ఉంది. ఇది కూడా బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

Published : 20 Apr 2023 00:42 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 44 వది. ధాత నామం వలెనే విధాత నామానికీ విశిష్టమైన అర్థం ఉంది. ఇది కూడా బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. విధి విధానాలను ఏర్పరచి, తగిన విధంగా ఫలితాలను ఇస్తుంటాడు విధాత. కర్మఫలాలను అందించేవాడు ఈ భగవానుడే అని తెలియజేస్తుందీ నామం. ప్రకృతి సమస్తం ఆ స్వామికి లోబడి ప్రవర్తిస్తుంటుంది. అంతటి శక్తి సంపన్నుడు ఆ స్వామి. అందుకే విధాత నామానికి తగినవాడయ్యాడు. 

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని