viral video : పూలు అమ్ముతూ.. బిడ్డలకు చదువు చెబుతూ..

రోడ్డు పక్కన పూలు అమ్ముతున్న మహిళ (Flower Seller) తన పిల్లలకు చదువు చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Published : 30 Aug 2023 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. వారిలా కష్టపడకుండా మంచి స్థాయిలో ఉండాలని కలలు కంటారు. తాజాగా పూలు అమ్ముతున్న మహిళ తన పిల్లలకు రోడ్డుపైనే చదువు చెబుతున్న వీడియోను ఝార్ఖండ్‌ డిప్యూటీ కలెక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఎక్స్‌ (ట్విటర్‌) లో పంచుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో ‘రోడ్డు పక్కన పూల బండి నడుపుతున్న ఓ మహిళ నిలుచుకొనివుంది. ఆమె పదే పదే వెనకకు తిరిగి చూస్తోంది. అక్కడ ఆమె పిల్లలు నేలపై కూర్చోని రాసుకుంటూ ఉన్నారు. తర్వాత వారి దగ్గరకు వచ్చి ఆమె తన పిల్లాడిని దగ్గరకు తీసుకుని హోంవర్క్‌ రాయించారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘తన పిల్లల భవిష్యత్తు పట్ల ఆ తల్లికి ఉన్న తపనను చూస్తుంటే దానికి క్యాప్షన్‌ రాయడానికి కూడా మాటలు రావడం లేదు’ ‘చదువు విలువ తెలిసిన ఆ తల్లి ఎంతో తెలివైనది. ఆమెకు వందనం’ ‘ భారతీయులు చదువుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. ఒకరోజు క్రితమే షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు చాలామంది వీక్షించారు. ‘చదువు విలువ గుర్తించేలా ఉన్న వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు ’ అని ఒక నెటిజన్‌ రాసుకొచ్చాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని