Viral Video: చిరుతను బెంబేలెత్తించిన కొండముచ్చులు .. వీడియో వైరల్‌

చిరుతపులిపై (Leopard) సుమారుగా 50 కొండముచ్చులు (baboons) మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated : 16 Aug 2023 17:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : సాధారణంగా క్రూర జంతువులు చిన్న / సామాన్య జంతువులపై దాడి చేయటం చూస్తాం. కానీ ఇక్కడ కొండముచ్చులు (Baboons) చిరుతపులిని బెంబేలెత్తించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. కొండముచ్చులు చిరుత పులిని ఎదిరించిన దృశ్యాలను లేటెస్ట్‌ సైటింగ్స్‌ (Latest Sightings)అనే యూట్యూబ్‌ ఛానల్ పంచుకుంది.

దక్షిణాఫ్రికాలో (south africa) ఓ మారుమూల ప్రాంతంలో సుమారు 50 కొండముచ్చుల గుంపు రోడ్డుపై వెళుతోంది. అదే క్రమంలో ఓ చిరుతపులి (Leopard) ఆహారం కోసం రోడ్డుపై నడుస్తూ వచ్చింది.  కొండముచ్చులను (baboons) గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా ఒక  కొండముచ్చు దానితో పోరాటానికి దిగింది.  వెంటనే మిగతా కొండముచ్చులు అప్రమత్తమై భయంతో పరిగెత్తకుండా.. మూకుమ్మడిగా చిరుతపై ఎదురు  దాడికి తిరిగాయి.  చాలాసేపు అది కొండముచ్చులతో పోరాడినా తర్వాత వాటి దాడికి తట్టుకోలేక అడవిలోకి పారిపోయింది.  

ఈ సంఘటనతో  రోడ్డుపై ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కాగా పలువురు నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఐకమత్యమే మహాబలం అనేది పిల్లలకు ఎలా వివరించాలో తెలియక ఇన్ని రోజులు ఆందోళన చెందాను. ఇప్పుడు ఈ వీడియో ఒకటి చాలు ఐకమత్యం గురించి చెప్పడానికి’ అని రాసుకొచ్చారు. ‘ఇలాంటి యూనిటీని ఎప్పుడూ చూడలేదని ’ మరొకరు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని