Udaipur: సంతోషం కోసమే పనిచేస్తున్నా.. స్ఫూర్తి నింపుతున్న వృద్ధుడి మాటలు..

పనిపట్ల నిబద్ధతను తెలిపిలా ఓ పెద్దాయన మాటలు తనకెంతో స్ఫూరినిచ్చాయంటూ ఓ నెటిజన్‌  ట్విటర్‌లో పంచుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 28 Jul 2023 18:03 IST

దిల్లీ: పనిపట్ల నిబద్ధతను తెలిపిలా ఓ పెద్దాయన మాటలు తనకెంతో స్ఫూరినిచ్చాయంటూ ఓ నెటిజన్‌  ట్విటర్‌లో పంచుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిరంతరం పని చేయడం అలవాటుపడి, ఖాళీగా గడపడం అంటే కాస్త ఇబ్బందికరమే. ‘ఆనందం కోసమే పని చేస్తున్నా’ అంటున్న ఆ పెద్దాయన మాటలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.  అందుకు సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. 

‘‘ఉదయ్‌పుర్‌ (udaipur)లోని కోర్టు సర్కిల్‌ దగ్గర ఓ వృద్ధుడు వేడి వేడి సమోసాలు (samosa ), పోహా (poha) అమ్ముతున్నాడు. నేను వెళ్లి తీసుకుని అతనితో కొద్దిసేపు ముచ్చటించా. ‘ఈ రోజు వర్షం ఎక్కువగా ఉంది. మీరు విశ్రాంతి తీసుకోవాల్సింది’ అని అడగగా.. ఆ పెద్దాయన ‘నేను ఈ వయసులో డబ్బు సంపాదించడం కోసం పని చేయడం లేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కంటే ఇక్కడ ఈ పని చేయడం నాకు సంతోషం. నేను చేసిన సమోసా, పోహా (వంటకాలు) తిని చాలామంది కస్టమర్లు రుచిగా ఉంది. అని చెబుతుంటే నా మనసుకు ఆనందంగా ఉంటుంది’ అని బదులిచ్చాడు. ఆయన సమాధానికి పని పట్ల (ఉద్యోగం)నాకున్న వైఖరి మారిపోయిందని నెటిజన్‌ రాసుకొచ్చాడు.

ఈ సంభాషణను ట్విటర్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది.  ఇప్పటివరకు దీనిని 1 మిలియన్ల మంది వీక్షించారు. ‘డబ్బు అనేది అవసరానికి మాత్రమే. మనం ఇష్టంగా పని చేస్తున్నప్పుడు అందులో ఆనందం ఉంటుందన్న మాట నిజమే. దీనిని పంచుకున్నందుకు ధన్యవాదాలు ’అని ఒక నెటిజన్‌ రాసుకొచ్చాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని