Bengaluru: ఫైన్‌ వేస్తున్నారా.. అవార్డు ఇస్తున్నారా?

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో ఓ బస్సు డ్రైవరుకు ట్రాఫిక్‌ పోలీసు ఫైన్‌ను (fine) గొప్ప బహుమతిలా (అవార్డు) అందించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.  

Updated : 22 Jul 2023 17:11 IST

బెంగళూరు: సాధారణంగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే దానికి సంబంధించిన ఫొటోలు, చలానాలు మొబైల్‌కు ట్రాఫిక్‌ పోలీసులు (Traffic police) పంపిస్తుంటారు.  బెంగళూరులోని ఒక మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బస్సు డ్రైవర్ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించాడు. మరుసటి రోజు కూడా డ్రైవరు బస్సును రాంగ్‌ రూట్‌ లో యూటర్న్‌ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను జోడించి ట్విటర్‌లో ఒక నెటిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని  ప్రశ్నించారు. దీనికి స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు బస్సు డ్రైవరుకు ఫైన్‌ వేశారు. అంతేకాకుండా ఆ చలానాను డ్రైవరుకు అందజేస్తూ ఫొటో దిగారు . దీనికి సంబంధించిన ఫొటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో  పంచుకోవడంతో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

‘డ్రైవరు చేసిన మంచి పనికి అవార్డు ఇస్తున్నారా? అని  రాసుకొచ్చారు.  మరొకరు  ‘డ్రైవరు పోజ్‌ చూస్తుంటే అతనికి ఇంకా పెద్ద అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు ఉందని ’ రాసుకొచ్చారు. ఇంకొకరు  నవ్వుతూ.. ‘అప్పుడే అమ్మిన కొత్త వాహనానికి  తాళం చెవిని అందజేస్తున్నట్లు ఉందన్నారు’. ‘డ్రైవరు చలానాను (అవార్డును) అంగీకరించినట్లుగా ఉన్నాడు’.‘ కౌన్‌ బనేగా కరోడ్ పతిలో విజేతకు అమితాబ్‌ ప్రైజ్‌ మనీ / చెక్‌ను అందిస్తున్నట్లు ఫొటో దిగారు ’అని  కామెంట్లను  జోడించారు.  ఇప్పటివరకు ఈ వీడియోను 2, 29 ,900 మంది వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని