Boat Ride: మొసళ్ల గుంపు మధ్యలో బోటు ప్రయాణం.. భయానక దృశ్యాలు వైరల్‌

boat ride in crocodile infested river: నదిలో మొసళ్ల గుంపు మధ్యలో నుంచి కొందరు బోటులో ప్రయాణించారు. ఈ భయానక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Published : 20 Aug 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొసలి (Crocodiles).. ఈ పదం వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. దాన్ని దగ్గర్నుండి చూస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది. అందుకే మొసళ్లుండే నదిలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు కదా.. ఆ నది దగ్గర్లోకి వెళ్లాలన్నా భయపడతారు. అలాంటిది మొసళ్ల గుంపు మధ్యలోంచి బోట్‌ రైడ్‌ (Boat Ride) చేస్తే..?ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Videos) అవుతోంది. (boat ride in crocodile infested river)

చిరుతను బెంబేలెత్తించిన కొండముచ్చులు .. వీడియో వైరల్‌

పదుల సంఖ్యలో మొసళ్లు ఉన్న నదిలో నుంచి ఓ బోటు ప్రయాణిస్తున్న వీడియో అది. అందులో బోటు ముందుకు వెళ్తున్న కొద్దీ దాన్ని మోటారు శబ్దానికి మొసళ్లు నది ఒడ్డుకు పరిగెడుతున్నట్లుగా కన్పిస్తోంది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. కొందరు ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత ప్రమాదకర నదిలో నుంచి ఎందుకు వెళ్లారు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని