viral video: పనిమనిషిని చితకబాదిన చైనా రాయబారి భార్య..!

చైనా రాయబారి భార్య పనిమనిషిపై తన ప్రతాపాన్ని చూపించారు. అందరూ చూస్తుండగా ఆమెను చితకబాదారు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 22 Jul 2023 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో చైనా రాయబారి నాంగ్ రోంగ్ భార్య ఒక పనిమనిషిపై బహిరంగంగా దాడి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగా ఆమెను చితకబాదారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!

పాకిస్థాన్‌లో చైనా రాయబారి భార్య తమ పనిమనిషిని చితకబాదారు. నడిరోడ్డులో ఆమెపై తన ప్రతాపం చూపించారు. తనను వదిలిపెట్టమని ఆ పనిమనిషి ఎంత వేడుకున్నా.. ఆమె వినిపించుకోలేదు. ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా లాగుతూ కొట్టారు. అంతేకాకుండా ఆమె కడుపులో గట్టిగా తన్నారు. అక్కడ ఉన్న వారు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. కాసేపటికి శాంతించారు. ఈ వీడియోను చూసిన పలువురు చైనా రాయబారి భార్యపై కామెంట్లతో విరుచుకుపడ్డారు.  ‘‘విద్య అనేది మనిషికి మంచి ప్రవర్తనను అలవరుస్తుంది. కానీ.. పిచ్చి ప్రవర్తనను కాదు’’అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘‘ఆమెకు పనిమనిషి నచ్చలేదేమో’’అని మరొకరు పోస్టు పెట్టారు. ‘‘కారణం ఏంటో చెప్పాలి కదా’’అంటూ ఒకరు, ‘‘యజమానుల చేతిలో కార్మికులు ఎంతగా హింసకు గురవుతున్నారో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది’’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ‘‘తప్పు చేస్తే పోలీసులకు అప్పగించాలి. కానీ.. ఈ విధంగా చేయకూడదు’’ అంటూ ఒకరు ‘‘మీరు చేస్తున్న పని సరైనది కాదు’’ అని మరొక రాసుకొచ్చారు.  ‘‘ఆమె నచ్చకపోతే ఇంటికి పంపించేయండి’’ అంటూ పోస్టు చేశారు. 

ఈ వీడియో పాకిస్థాన్‌ ప్రభుత్వ దృష్టికి చేరింది. ప్రభుత్వం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై విచారణ జరుపుతామని.. బాధితురాలికి చికిత్స అందిస్తామని తెలిపింది. దర్యాప్తు అనంతరం ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని