ఎంత వేగానికి.. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే..?

వేగం కారణంగా ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుందని వివరిస్తూ.. ఓ నెటిజన్‌ రూపొందించిన వీడియో ఆలోచింపజేస్తుంది. 

Updated : 25 Jul 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నపాటి అలసత్వం, ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి కారణంగా ఏటా రహదారి ప్రమాదాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో ఎక్కువ శాతం ప్రమాదాలకు అధిక వేగం కారణమని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) వెల్లడించింది. చాలా మంది చోదకులు వేగంగా వాహనాలను నడుపుతూ రోడ్డు మలుపులను సరిగ్గా అంచనా వేయలేక నియంత్రణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఎంత వేగంతో ప్రయాణిస్తే  ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుందని వివరిస్తూ ఓ నెటిజన్‌ రూపొందించిన వీడియో ఆలోచింపజేస్తుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తూ.. ప్రమాదానికి గురైతే ప్రయాణికులపై ఎంత మేర ప్రభావం ఉంటుందనేది వీడియోలో చూపించారు. ఇక్కడ వేగాన్ని కొలవడానికి కిలోమీటర్లకు బదులు మైలును పరిగణనలోకి తీసుకున్నారు. (1 Mph= 1.6Kmph)గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని