Viral Video: వెదురు ‘వాష్‌ బేసిన్‌’.. 100 శాతం నేచురల్‌..!

నాగాలాండ్‌లో పర్యావరణహిత వెదురు ‘వాషింగ్‌ బేసిన్‌’లు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌.. ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Updated : 12 Aug 2023 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా మనకు వాష్‌ బేసిన్‌ (Wash Basin) అంటే గుర్తొచ్చేది.. ఒక కుళాయి.. దాని కింద ఓ తొట్టెలాంటి నిర్మాణం. కానీ, నాగాలాండ్‌ (Nagaland) పల్లెల్లో మాత్రం ప్రత్యేక పద్ధతిలో రూపొందించిన వాష్‌ బేసిన్లు ఆకట్టుకుంటున్నాయి. పైగా, వాటిని పర్యావరణహితంగా ‘వెదురు’తో తయారు చేయడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నాగాలాండ్‌ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌(Nagaland minister Temjen Imna Along) ఇలాంటి ఓ వాష్‌ బేసిన్‌ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. దీంతో ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌ కమిటీలో సుధామూర్తి

వీడియోలో.. ఒక పొడవాటి, బోలుగా ఉండే వెదురు కర్రకు ముందుగా రంధ్రాలు చేసి, దాని గుండా నీటిని పారిస్తున్నారు. ఆ రంధ్రాల వద్ద బిగించిన బిరడాలను తొలగించడం ద్వారా బయటకు వచ్చే నీటితో చేతులు శుభ్రం చేసుకోవచ్చు. అక్కడే చేతులు తుడుచుకునేందుకు వస్త్రం, హ్యాండ్‌వాష్‌ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇది 100 శాతం పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదని స్థానికులు చెప్పారు. వీటికి నీటి సౌకర్యాన్ని.. సమీప కొండల్లోని నదులనుంచి తీసుకోవడం గమనార్హం. నెటిజన్లు సైతం ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని