viral video: స్టింగ్‌ మ్యాగీ ఎప్పుడైనా చూశారా.. వైరల్‌ అవుతున్న తయారీ వీడియో..

viral video: విభిన్నంగా చేసే ప్రయత్నాలన్నీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. అచ్చం అలాగే ఎనర్జీడ్రింక్‌తో మ్యాగీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.

Published : 27 Jul 2023 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మ్యాగీ.. అంటే ఇష్టపడని వారే ఉండరు. దీనిపై ఉన్న మక్కువతో విభిన్న పద్ధతుల్లో మ్యాగీని తయారు చేస్తుంటారు. కొందరేమో దీనిపై ఏకంగా ప్రయోగాలు చేస్తుంటారు. మ్యాగీ వండే సమయంలో విస్కీని కలిపి భిన్నంగా వండే వీడియోలు చూశాం. అలాగే మాంసంలో, ఐస్‌క్రీమ్‌తో తయారు చేసిన మ్యాగీనీ చూశాం. ఈ ప్రయోగాలన్నీ ఇప్పుడు పాతబడిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఎనర్జీ డ్రింక్‌తో మ్యాగీ వండటం మొదలు పెట్టేశారు. ఒక వీధి వ్యాపారి స్టింగ్‌ ఎనర్జీ డ్రింక్‌తో మ్యాగీని వండిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. 

 పైకప్పు ఊడినా.. ఆగని ఆర్టీసీ బస్సు ప్రయాణం!

అందరూ ఇష్టపడే మ్యాగీని కొత్తగా వండుదాం అనుకున్నాడో ఏమో ఏకంగా ఎనర్జీ డ్రింక్‌తో మ్యాగీ చేయటం మొదలుపెట్టాడు. స్టింగ్‌లో మ్యాగీని వేసి బాగా వేడి చేశాడు. అందులో కూరగాయలు, కొన్ని మసాలాలు, నెయ్యి వేసి ఆ డ్రింక్‌లో మ్యాగీ మగ్గేంత వరకు అలాగే ఉంచాడు. అంతే ఎర్రగా డ్రింక్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఈ మ్యాగీ వీడియోను ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోవటంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ‘ఇదేం కొత్త రకం మ్యాగీరా బాబూ’ అంటుంటే మరొకొందరేమో ‘ఈ మ్యాగీ తింటే ఇక అంతే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను 7 మిలియన్ల మంది వీక్షించారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని